Site icon NTV Telugu

Rilee Rossouw: “ఐపీఎల్ ఒక సినిమా డ్రామా”.. IPL కంటే PSL గ్రేట్ అంటూ రోసో పిచ్చి కూతలు..

Rilee Rossouw

Rilee Rossouw

Rilee Rossouw: ఐపీఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ వేరు. ఈ మధ్యే పాకిస్థాన్ ప్రారంభించిన పీఎస్‌ఎల్ గురించి కొందరికి సరిగ్గా తెలియదు. ఐపీఎల్‌లో ఒక్క టీమ్ ఖరీదు.. పీఎస్‌ఎల్‌లో మొత్తం టీమ్‌ల ఖరీదుకు సమానం. ప్రస్తుతం ఐపీఎల్‌లో కొంత మంది ప్లేయర్స్‌కు ఇస్తున్న నగదు.. ఆ దేశ క్రికెట్‌ బోర్డులు కూడా ఇవ్వలేవు! అలాంటి ఇండియాన్ ప్రీమియర్ లీగ్‌పై ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న రిలీ రోసో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్, పీఎస్‌ఎల్‌ను పోలుస్తూ పిచ్చి వాగుడు వాగాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ లోనే పోటీ ఎక్కువగా ఉంటుందని, అక్కడ క్రికెట్ కంటే సినిమా డ్రామానే ఎక్కువని విమర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఐపీఎల్ చాలా సుదీర్ఘమైన టోర్నమెంట్. దానికి బాలీవుడ్ మద్దతు ఎక్కువగా ఉంటుంది. అందుకే అది చూడటానికి క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా ఒక సినిమా లాగా అనిపిస్తుంది. కానీ పీఎస్ఎల్ అలా కాదు, ఇది చాలా తక్కువ రోజుల్లో ముగుస్తుంది. ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

READ MORE: Gmailలో సరికొత్త ఫీచర్‌.. ఇది WhatsAppలా పనిచేస్తుంది..!

పీఎస్‌ఎల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. బాల్ ట్యాంపరింగ్, మ్యాచ్ మధ్యలో బాల్ గులాబి రంగులోకి మారడం, అంపర్లైన తప్పుడు నిర్ణయాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇక ఐపీఎల్, పీఎస్‌ఎల్‌ను పోల్చడం.. పులిని కుక్కతో పోల్చడంతో సమానం అని రిలీ రోసోకి తెలియదు అనుకుంటా. ఐపీఎల్‌లోని టీమ్స్‌ అంటే ఫ్యాన్స్‌కు పెద్ద ఎమోషన్. తమ టీమ్ గెలవాలని తాపత్రయపడతారు. స్టేడియంలు నిండిపోతాయి. ఆన్‌లైన్‌లో కోట్ల మంది రోజూ ఈ మ్యాచ్‌లను వీక్షిస్తారు. తమ అభిమాన టీమ్ మ్యాచ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. కానీ.. పాకిస్థాన్ సూపర్ లీగ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్టేడియంలో ఖాళీగా కనిపిస్తాయి. ఆ దేశంలో చాలా మంది పీఎస్‌ఎల్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. కోట్లలో వీవ్స్‌ కూడా ఉండవు. ఇది పక్కన పెడితే.. పీఎస్‌ఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లోనే స్టేడియం ఖాళీగా ఉండటం. అభిమానులు లేకుండానే ఈ సీజన్ ప్రారంభం అవ్వడం.. పీఎస్‌ఎల్‌పై జనాధరణ లేదని చెప్పడానికి పర్ఫెక్ట్‌ ఎగ్జామ్‌పుల్.

Exit mobile version