Ricky Ponting Heap Praise on Joe Root: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మాత్రమే బద్దలు కొడతాడు అని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా రూట్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ మాత్రమే. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్ సెంచరీల రికార్డుకు చేరువగా విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. అయితే టెస్టుల్లో 8848 పరుగులు మాత్రమే చేశాడు. రూట్ మాత్రం 13,906 పరుగులు బాదాడు.
తాజాగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ… ‘మరో నాలుగేళ్ల పాటు జో రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడు. ఇంగ్లండ్ జట్టు ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీద అతడి రన్స్ ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఉండి.. సంవత్సరానికి 800-1000 పరుగుల చొప్పున సాధిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేయడం రూట్‌కు సాధ్యమే.33 ఏళ్ల రూట్.. 37 ఏళ్ల వయసులోనూ పరుగుల దాహంతో ఉంటేనే ఇది సాధ్యం. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు శైలిని మార్చేశాడు. మరో నాలుగేళ్ల పాటు ఇలాగే ఆడితే కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడు’ అని అన్నాడు.
Also Read: IND vs BAN: ఎన్ని ట్రోఫీలు ఆడినా.. నాకు తుది జట్టులో స్థానం కష్టమే: సర్ఫరాజ్ ఖాన్
సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (13,378) ఉన్నాడు. దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ (13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ (12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార సంగక్కర (12, 400) వరుసగా ఉన్నారు. ఏడో స్థానంలో జో రూట్ (12,027) ఉన్నాడు.