Site icon NTV Telugu

Rice Mill Collapse : కూలిన రైస్ మిల్.. శిథిలాల కింద చితికిన బతుకులు

Rice Mill

Rice Mill

Rice Mill Collapse : హర్యానాలోని కర్నాల్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రైస్‌ మిల్లు కుప్పకూలింది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనంలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ఈ భవనం శిథిలాల కింద 150 మందికి పైగా కూలీలు చిక్కుకున్నారు. వారిలో 100 మందిని సురక్షితంగా బయటకు తీశామని.. ఇంకా కొంత మంది చిక్కుకుపోయి ఉంటారని.. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు.

Read Also: Ileana: ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన గోవా బ్యూటీ…

ఇది కర్నాల్‌లోని తారావాడి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శివశక్తి రైస్‌మిల్‌ అనే భవనంలో కొంత భాగం కూలిపోయింది. దీంతో మిల్లు పక్కనే ఉన్న లేబర్స్ హాస్టల్‌లో నిద్రిస్తున్న 157 మంది కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో నలుగురు మరణించగా, 100 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో 20 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 2 బృందాలను నియమించినట్లు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

Read Also: Vande Bharat Express: వేగాన్ని అందుకోలేకపోతున్న వందేభారత్.. సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే..

Exit mobile version