Site icon NTV Telugu

RGV – iBomma Ravi : రాబిన్ హుడ్ రవి – పైరసీని హీరోయిజం చేస్తున్న ట్రెండ్‌పై ఆర్జీవీ కౌంటర్

Emadi Ravi,rgv

Emadi Ravi,rgv

‘ఐబొమ్మ’ వంటి పైరసీ సినిమా వెబ్‌సైట్లపై ఇటీవల పోలీసు చర్యలు వేగవంతమయ్యాయి. వాటిలో భాగంగా, సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. దర్యాప్తు అధికారులు రవిని కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి పొందారు. ఈ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందించారు. పైరసీ పూర్తిగా నిర్మూలం అవుతుందా అనే ప్రశ్నకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : Keerthy Suresh : కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..

ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇలా అన్నారు.. “పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పోలీస్ కంట్రోల్ ఎంత కఠినమైన సినిమా ఫ్రీగా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఉన్నంత కాలం, వారికి లింకులు ఇచ్చే రవి లాంటి వారు ఎప్పటికీ ఉంటారు. కొంతమంది రవిని ‘రాబిన్ హుడ్’ ‌తో పోల్చుతూన్నారు రాబిన్ హుడ్ నిజమైన హీరో కాదు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిన మొదటి టెర్రరిస్ట్ లాంటోడు. ధనవంతుల నేరం ఏంటంటే కష్టపడి డబ్బు సంపాదించడం. దోపిడీని మహిమలు చెబుతూ దొంగను దేవుడిలా చూస్తూ పోవడం ప్రజల అజ్ఞానం’ అని తెలిపారు.

అలాగే సినిమా టికెట్ రేట్లు, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే కోణంలో పైరసీని సమర్థించడం అత్యంత ప్రమాదం అని ఆయన అభిప్రాయపడ్డారు. “BMW కారు ఖరీదు గా ఉందా? కాబట్టి షోరూమ్ దోచేయాలా? బంగారం ఖరీదు గా ఉందా? జ్యువెల్లరీ షాప్ దోచుకుని అందరికీ పంచాలా? ఇదంతా అసంబద్ధం కదా. అయితే సినిమాకి మాత్రం ఆ లాజిక్ ఎందుకు?” అని ప్రశ్నించాడు. పైరసీ చూడడంలో ‘నైతికత’ లేదని, కేవలం సౌకర్యం మరియు ఖర్చు తగ్గడం వల్ల ప్రజలు పైరసీకి అలవాటు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

‘పైరసీని పూర్తిగా ఆపాలంటే పైరసీని, సరఫరా చేసే వాళ్లతో పాటు చూసే వాళ్లను కూడా నేరస్తులుగా చూడాలి. 100 మంది పైరేటెడ్ సినిమా చూసిన వారిని యాదృచ్ఛికంగా అరెస్ట్ చేసి, వారి పేర్లను పబ్లిక్‌గా ప్రకటిస్తే ఒక్కసారి భయం పుడుతుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది పైరసీ సినిమా చూడటం అంటే, దొంగ వస్తువులు కొనడమే.” రవి అరెస్ట్‌తో పైరసీ చర్చ మరోసారి ముదిరిన ఈ సమయంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు కొత్త డిబేట్‌కు తావిస్తున్నాయి.

 

Exit mobile version