RGV Ramayana Review: రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన స్టైల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) సినిమాను ఆయన రెండోసారి చూసి ఫిదా అయిపోయారు. తాను ఓ నాస్తికుడినని, రామ భక్తుడిని కానని స్పష్టం చేస్తూనే.. సినిమాను ఒక నిజమైన సినిమా ప్రేమికుడిగా (Movie Enthusiast) విశ్లేషిస్తూ ఎక్స్ (X) వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు. ఈ చిత్రానికి ఇండియన్ సినిమా (Indian Cinema) హిస్టరీలో ‘తాజ్ మహల్’ (Taj Mahal of Cinema) లాంటి స్థానం ఉంటుందని ఆకాశానికెత్తేశారు.
ఆర్జీవీ దీన్ని ఒక భక్తి కోణంలో కాకుండా కేవలం మేకింగ్ స్టాండర్డ్స్, విజువల్స్ పరంగా మాత్రమే చూశారు. సినిమా రేంజ్, విజువల్ ఎఫెక్ట్స్ (Visual Effects), యాక్టర్ల పెర్ఫార్మెన్స్ గురించి చెబుతూ.. హాలీవుడ్ (Hollywood) సినిమాలే దీని ముందు స్టేజ్ నాటకాల్లా కనిపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ నితీశ్ తివారి, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఇండియన్ టాలీవుడ్లో ఇప్పటివరకు ఎవరూ ఊహించని సాహసం చేశారని కొనియాడారు. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే కాస్మిక్ బ్యాటిల్ (Cosmic Battle), రావణాసురుడి పది తలలు, అడవి సీన్లు చాలా బాగున్నాయని, ముఖ్యంగా రావణుడికి జటాయువుకు మధ్య జరిగే యుద్ధ సన్నివేశం (Battle Scene) సినిమాకే హైలైట్ అని చెప్పుకొచ్చారు. నెగెటివ్ రివ్యూలు (Negative Reviews) ఇచ్చేవాళ్లపై మండిపడుతూ.. వాళ్లు ఒక కొండను చూసి దారి సరిగ్గా లేదని వాపోయినట్లు ఉందని, కానీ ఆ భారీ తాజ్ మహల్ కట్టిన వాళ్ల ముందు ఆ విమర్శకులు చాలా చిన్నవాళ్లని ఘాటుగానే బదులిచ్చారు.
ఈ సినిమాలో రావణ పాత్రలో నటించిన యశ్ (Yash) యాక్టింగ్ గురించి ఆర్జీవీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. యశ్ నటన కేవలం ఒక్క ఏడాదికి సంబంధించినది కాదని, అది ‘చాలా దశాబ్దాల’ (Performance of Many Decades) మేటి నటన అని ప్రశంచించారు. రావణుడిలో ఉండే ఇంటెలిజెన్స్, శివ భక్తి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ (Inner Conflicts) అన్నీ స్క్రీన్ పై బాగా పండించాడని, సినిమాలో రావణుడే మెయిన్ గ్యావిటేషనల్ సెంటర్ (Gravitational Centre) అని చెప్పారు. “అసలు రావణుడు లేకపోతే అక్కడ రాముడు లేడు” అని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
ఇక రాముడి పాత్రలో నటించిన రణ్ కపూర్ (Ranbir Kapoor) యాక్టింగ్ మీద వస్తున్న విమర్శలను ఆర్జీవీ తిప్పికొట్టేశారు. రాముడు తక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడని కొందరు అంటున్నారని, కానీ రాముడి పాత్రే అలాంటిదని, అతని సైలెంట్ క్యారెక్టర్లో ఉండే కంట్రోల్, రిజర్వ్డ్ నేచరే మెయిన్ అని డిఫెండ్ చేశారు. ఎగైల్ సీక్వెన్స్‌లలో రణ్‌బీర్ నటన అద్భుతంగా ఉందని చెప్పారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. హన్స్ జిమ్మర్ (Hans Zimmer), ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) కాంబినేషన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా విజువల్స్‌తో పోటీ పడకుండా, వాటికి పర్ఫెక్ట్గా సింక్ అయ్యిందని అన్నారు. తాండవ సీన్స్, ఏరియల్ బ్యాటిల్స్ టైమ్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూమెంటమ్‌ను గ్రిప్పింగ్‌గా ఉంచిందని చెప్పారు. సినిమా రన్ టైమ్ (Run Time) మూడు గంటలు ఉండటంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. రావణుడి పాత్రను, రాముడి అజ్ఞాతవాసాన్ని బ్యాలెన్స్ చేయాలంటే అంత టైమ్ పడుతుందని, డైరెక్టర్ దీన్ని మామూలు యాక్షన్ డ్రామాగా మార్చకుండా గొప్పగా తీర్చిదిద్దాడని మెచ్చుకున్నారు.
మన దేశపు ఓన్ స్టోరీస్, కల్చరల్ హెరిటేజ్ (Cultural Heritage) నుంచి వచ్చిన ఈ సినిమాకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ (The Lord of the Rings) లేదా అవతార్ (Avatar) లాంటి హాలీవుడ్ ఫ్రాంచైజీల నుంచి కాపీ కొట్టాల్సిన అవసరమే రాలేదని ఆర్జీవీ స్పష్టం చేశారు. స్టార్ రేటింగ్స్‌తో (Star Ratings) ఈ సినిమా స్థాయిని కొలవలేమని, భవిష్యత్తులో వచ్చే సినిమాలన్నీ దీనితోనే కంపేర్ చేయబడతాయని చెప్పారు. ఫస్ట్ పార్ట్‌ను మించిన సీక్వెల్ (Sequel) ఒక్కటే దీన్ని దాటగలదని అభిప్రాయపడ్డారు. ఆర్జీవీ పెట్టిన ఈ లాంగ్ పోస్ట్‌కు డైరెక్టర్ నితీశ్ తివారి కూడా థ్యాంక్స్ చెప్పారు. కాగా, సినిమా రిలీజ్ అయిన కొత్తలో నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్లను ‘మొరిగే కుక్కలతో’ పోల్చిన ఆర్జీవీ.. ఇప్పుడు ఇలా కూల్‌గా, డీటెయిల్డ్‌గా సినిమాలోని ప్రతి క్రాఫ్ట్‌ను అప్రిషియేట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

