Site icon NTV Telugu

RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‎పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ

RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం బ్రిటన్ ప్రధానిగా పదవి చేపట్టిన రిషి సునాక్ బ్రిటన్ పౌరులకు భరోసా ఇస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం విన్నంతనే భారతీయులు ఆయనను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Read Also: Sitrang Cyclone: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. 35 మంది మృతి

ఇందులో భాగంగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా రిషి సునాక్ ను అభినందింస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. 200 ఏళ్ల పాటు మనలను పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం ఎట్టకేలకు మనకు ఇప్పుడు దొరికింది అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ దిశగా సత్తా చాటిన రిషి సునాక్ కు అభినందనలు అంటూ వర్మ బ్రిటన్ కొత్త ప్రధానిని ఆకాశానికెత్తేశారు.

Read Also: Kantara Record: కేజీఫ్ రికార్డులను బ్రేక్ చేసిన కాంతార

భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ విజయాన్ని భారతీయులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మరీ ముఖ్యంగా రిషి సునాక్‌తో సాన్నిహిత్యం, బంధుత్వం ఉన్నా వారి కుటుంబాల్లో ఈ సంబరాలు మరింత ఎక్కువగా కనిపించాయి. రిషి సునాక్‌కి పంజాబ్‌లోని లుథియానాలో సమీప బంధువులు ఉన్నారు. అలాగే ఆయన అత్తగారి ఇల్లయిన బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోనూ రిషి సునాక్‌కి సమీప బంధువులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానిగా ఎన్నిక అవడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Exit mobile version