NTV Telugu Site icon

Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్

New Project 2024 07 08t123816.426

New Project 2024 07 08t123816.426

Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్‎గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు. విద్యార్థులను ఇంటికి పంపి అతడు మత్తులో క్లాస్ రూంలో నిద్రపోయాడు. ఈ విషయం రేవాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బోడాబాగ్‌కు సంబంధించినది. ప్రిన్సిపాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వైరల్ వీడియోలో ప్రిన్సిపాల్ మద్యం తాగి పాఠశాల లోపల నిద్రిస్తున్నట్లు కనిపించింది. ఆ ప్రిన్సిపాల్ పేరు రమాకాంత్ అని తెలిసింది.

Read Also:France Elections 2024: హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు.. డైలమాలో మాక్రాన్..!

మద్యం మత్తులో పాఠశాలకు చేరుకుని తరగతి గదిలో చదువుతున్న విద్యార్థులను పాఠశాల నుంచి వెళ్లగొట్టి, అక్కడ నిద్రించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది బోడాబాగ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్ రమాకాంత్ వర్మ రోజువారీ చర్య ఇదే అని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాల తరగతి గదిలోనే ప్రిన్సిపాల్ చాలాసార్లు వాంతులు చేసుకున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. ఇతని చర్యల వల్ల పాఠశాలలో చదువుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు కూడా ఆందోళనకు దిగారు.

Read Also:Heart Attack : పాఠశాలలో ఒక్కసారిగా కూలబడిపోయిన విద్యార్థి.. వైరల్ వీడియో..

వైరల్ వీడియో మా దృష్టికి వచ్చిందని కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఉపాధ్యాయులు మద్యం సేవించి తరగతిలోకి ప్రవేశించినట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు పాఠశాలలో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిపై విచారణ జరుపుతామని, ఎవరైనా ఉపాధ్యాయులు మద్యం సేవించే అలవాటుంటే అలాంటి వారిని విద్యాశాఖలో కొనసాగించకూడదన్నారు.