Komatireddy: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సిఆర్ఐఎఫ్ రోడ్లు, రూరల్ రోడ్స్, మెడికల్ బిల్డింగ్స్, రాష్ట్ర రహదారులు, ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణాలతో పాటు బ్లాక్ స్పాట్ల రిపేర్లకు సంబంధించి వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, వాటి స్థితిగతులపై ఉన్నతాధికారులతో విభాగాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Read also: Heart Attack : ఈ టీని రోజూ తాగితే హార్ట్ ఏటాక్ జన్మలో రాదు.. ఆ సమస్యలు పరార్..
ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్ హెచ్ 65 రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణాలపై అధికారులతో సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్-విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ఏరియాలను అధికారులు వివరించారు. చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, యాక్సిడెంట్స్ రోడ్డు జరుగుతున్నది. బ్లాక్‌స్పాట్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు.
Read also: Breaking: ఇరాన్‌లో భారీ భూకంపం..
వెంటనే సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డుపై కొన్ని చోట్ల ఆరు లైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్ ల నిర్మాణం, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రమాదరహిత రహదారులుగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే సూపర్ గేమ్ ఛేంజర్ ఆర్ఆర్ఆర్ అని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..