Site icon NTV Telugu

Bhu Bharati Act: నేటి నుంచి ఈ నెల 20 వ‌ర‌కు అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు

Minister Ponguleti

Minister Ponguleti

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. భూ సమస్యలు లేని తెలంగాణ కోస ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల భూ సమస్యలు తీర్చాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్​ యాక్ట్​ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నేటి నుంచి(జూన్ 03) ఈ నెల 20 వ‌ర‌కు అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read Also: Kamareddy: నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలింపు..

భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాన‌వీయ కోణంలో భూస‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాలని కోరింది. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం వెళ్లనుంది. ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారించనున్నారు. మండలాల వారిగా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ని ప్రకటించి ఏ రోజున ఏ గ్రామంలో సదస్సు జరుగుతుందనేది ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తున్నారు.

Read Also: Waqf Act: “వక్ఫ్ ఆస్తుల” రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం..

భూ భారతి చట్టం ద్వారా ధరణిలో పరిష్కారం కాని సాదా బైనామా, మిస్సింగ్ సర్వే నంబర్, రైతు వివరాలల్లో తప్పులు, డిజిటల్ సిగ్నిచర్ పెండింగ్, అసైన్డ్ టు పట్టా క్లాసిఫికేషన్, ప్రోహిబిటెడ్ జాబితా మార్పు, సక్సెషన్, పెండింగ్ మ్యుటేషన్, భూసేకరణ సమస్యలు, ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్​మెంట్ల మధ్య డిస్​ప్యూట్​ఉన్న భూముల మార్పు, తదితర అంశాల కోసం భూ భారతి ఆర్వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version