NTV Telugu Site icon

Yemen-Israel: ఇజ్రాయెల్‌పై ప్రతీకారం..! యెమెన్‌ తిరుగుబాటుదారులు దాడి

Yemen

Yemen

గాజా, లెబనాన్‌లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ్-సెంట్రల్ ఇజ్రాయెల్‌లో తెల్లవారుజామున చేసింది. గురువారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ కమాండర్ మహ్మద్ సురూర్ మృతి చెందాడు. ఈ క్రమంలో.. యెమన్ దాడి చేసింది. కాగా.. సురూర్ హౌతీ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చాడు.

Read Also: China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?

ఇజ్రాయెల్ మిలటరీ శుక్రవారం ఒక తాజా ప్రకటనలో.. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ యెమెన్ నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణిని ధ్వంసం చేసిందని పేర్కొంది. క్షిపణిని ధ్వంసం చేసిన తర్వాత.. దాని శిథిలాలు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో పడిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఈ దాడి తర్వాత హోం ఫ్రంట్ కమాండ్ నుండి కొత్త సూచనలు లేవని IDF తెలిపింది.

Read Also: Kunki Elephants: కుదిరిన ఎంవోయూ.. దసరా తర్వాత ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు..

సురూర్ మరణానికి ప్రతీకారం
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు దాడికి బాధ్యత వహించారు. కానీ దాని వెనుక కారణాన్ని వెల్లడించలేదు. అయితే.. గురువారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. గురువారం బీరుట్‌లోని నివాస భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక దాడితో పేల్చివేసింది. హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ హుస్సేన్ సురూర్ భవనం లోపల ఉన్నట్లు వెల్లడైంది. ఈ దాడిలో సరూర్ చనిపోయాడు. హిజ్బుల్లా కూడా అతని మరణాన్ని ధృవీకరించింది.