Site icon NTV Telugu

Congress Victory: కొడంగల్లో రేవంత్ రెడ్డి విజయం

Reavanth

Reavanth

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హస్తం హవా కొనసాగుతుంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు.. ఆందోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజనర్సింహ గెలుపొందారు. 24,422 మెజార్టీతో బీఆర్ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌పై విజయం సాధించారు. జుక్కల్‌లోనూ కాంగ్రెస్‌ గెలుపొందింది. 708 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విజయం సాధించారు. 54 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందడంతో.. పలుచోట్ల లీడింగ్ లో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Exit mobile version