తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
Read Also: Kerala doctor Suicide: BMW కారు, బంగారం కట్నంగా ఇవ్వలేదని ఆగిన పెళ్లి.. పెళ్లికూతురు ఆత్మహత్య..
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. అందులో రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాడు అందిస్తానని నేను హామీ ఇస్తున్నానని’ ట్వీట్ లో పేర్కొన్నారు.
Read Also: Kodali Nani: రైతాంగం ఎవరూ ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది..
మరోవైపు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అటు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అని పేర్కొన్నారు.
