NTV Telugu Site icon

Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికలపై జూమ్ మీటింగ్.. నేతలకు దిశానిర్దేశం

Revanth Reddy

Revanth Reddy

మునుగోడు ఉప ఎన్నికలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. అయితే.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ ఆర్. దామోదర్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నదీమ్ జావిద్ రోహిత్ చౌడరీ, షబ్బీర్ అలీ, మల్లు రవి, సంపత్ కుమార్, శంకర్ నాయక్, అనిల్ రెడ్డి, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుంది. మనం బూత్ లెవెల్ నాయకులను సిద్ధం చేసుకుంటే వారిని కూడా కొంటున్నారు. ఇప్పటి వరకు మనం అద్భుతంగా పని చేసాము. ఇక నుంచి మరింత అప్రమతంగా ఉండాలి.. టీఆర్ఎస్, బీజేపీ లు మరింత దిగజారి పోయి నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి గ్రామగ్రామాన ప్రచారంలో పాల్గొంటాను.. వేం నరేందర్ రెడ్డి ప్రచార కార్యక్రమాలను ప్రణాళిక చేస్తారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వాళ్లు పూర్తి సమయం అక్కడే కేటాయించాలి.

Also Read : Telangana Group 1 : నేడే తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. 15 నిమిషాల ముందే గేట్‌ బంద్

31వ తేదీన ఇందిరాగాంధీ వర్ధంతి నాడు హైదరబాద్ లో భారత్ జోడో భారీ ప్రదర్శన ఉంటుంది . ఆ రోజు మునుగోడు క్యాడర్, నాయకులు పాల్గొంటారు. ఎన్నికలు అయ్యే వరకు ప్రచార బాద్యతల్లో ఉన్నవారు ఎవరు నియజక వర్గాన్ని విడిచిపెట్టవద్దు. నవంబర్ 3వ తేదీ తర్వాత మునుగోడు ఎన్నికలలో పని చేసిన వారితో రాహుల్ గాంధీ గారితో జోడో యాత్రలో ప్రత్యేకంగా పాల్గొనే విదంగా ఏర్పాటు చేస్తున్నాం. మూడు రోజులపాటు రాహుల్ గాంధీ తో మునుగోడు లో పని చేసిన వారు ఉంటారు. మునుగోడు ఎన్నికలు మన పార్టీ కి అత్యంత ప్రతిష్టాత్మకం.. ఎవ్వరు నిర్లక్షంగా ఉండవద్దు. బీజేపీ, టిఆర్ఎస్ నాయకుల అక్రమాలను, అవినీతిని అడ్డుకునేందుకు గ్రామాలకు వస్తున్న ఆయా పార్టీల నాయకులను నిలాడేసేలా కార్యాచరణ చేపట్టాలి’ అని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Show comments