NTV Telugu Site icon

CM Revanth Reddy : అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఉన్నతాధికారుల బృందంతో కలిసి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. . ఈ పర్యటనలో తెలంగాణ బృందం గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉత్పాదక చర్చలు జరిపింది. తెలంగాణలో టెక్ సేవల విస్తరణ, AI సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ స్థాపన , ఈ ప్రాంతంలో శ్రామిక శక్తి సంసిద్ధతను పెంపొందించేందుకు రూపొందించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులతో సహా పలు కీలక కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.

UP Video: సాధువుల వేషంలో చోరీలు.. నలుగురికి దేహశుద్ధి

ఇదిలా ఉంటే.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిన్న ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా మారుతోందని అన్నారు. తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరించారు.మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి… అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామన్నారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామన్నారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.

Dragon Fruits: అయ్యబాబోయ్.. డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇన్ని లాభాలా.?