తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా వచ్చే నెల 2వ తారీఖున ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో పొంగులేటి వ్యవసాయ క్షేత్రంలో సభాస్థలి ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ పరిశీలించనున్నారు.
Read Also: Virupaksha: విరూపాక్ష డైరెక్టర్ కి సర్పైజ్ ఇచ్చిన హీరో, నిర్మాత
ఈమేరకు రేవంత్ రెడ్డి సభాస్థలి దగ్గర సూచనలు, సలహాలు చేయనున్నారు. అలాగే మాజీ ఎంపీ పొంగులేటితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై సభ నిర్వహణ, జన సమీకరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వచ్చేనెల 2న నిర్వహించే సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీలో తాను చేరుతున్న సందర్భంగా సభను విజయవంతం చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించగా, దాదాపు 100 ఎకరాల్లో ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Also: Wednesday Special : మీ మనోభీష్టాలు నెరవేర్చే స్తోత్రాలు.. బుధవారం నాడు భక్తిశ్రద్ధలతో వినండి
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల సమయాన ప్రచార నిమిత్తం ఖమ్మం వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వస్తుండడంతో సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు ఖమ్మానికి 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధి నుంచి జన సమీకరణ చేయనున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, కోదాడ, ములుగు తదితర ఏరియాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు.