CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టీపీసీసీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక సందేశం పంపిస్తూ పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ వైఖరి పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. “గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ” అని అన్నారు.. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం మోదీ ప్రభుత్వ లక్ష్యపూర్వక చర్యే” అని విమర్శించారు. ఓటు చోరీపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా విచ్చలవిడిగా కేసులు తెరపైకి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విలువలను కాపాడే బాధ్యత అందరిదినని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు మద్దతుగా నిలబడే తీర్మానం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భారీ డిస్కౌంట్స్ ధరతో Vivo X300, X300 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?
ఇక రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్త సర్పంచులు ఎన్నికయ్యే సందర్భంలో జిల్లా అధ్యక్ష పదవులు రావడం మీకు గొప్ప అవకాశం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రేషన్ కార్డులు, తెల్ల బియ్యం, ఉచిత విద్యుత్, RTC బస్సులు వంటి సంక్షేమ పథకాలపై చర్చ పెట్టాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. కేసీఆర్ ఇచ్చిన చీరలు పనికిరావని ప్రజలు నిందించారు. కానీ, మనం నిజాయితీతో కోటి మందికి చీరలు ఇస్తున్నాం. ఏ ఆడబిడ్డ కూడా చీర దక్కకుండా ఉండకూడదని తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా చీరలు అందజేయకపోతే అది జిల్లా కాంగ్రెస్ కమిటీల బాధ్యత అవుతుందని హెచ్చరించారు.
అలాగే అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడుతూ.. నాచారం ప్రాంతంలోని పరిశ్రమలను పట్టణం వెలుపలకు మార్చాలని, ఇందుతో మధ్యతరగతి కుటుంబాలు భూములు కొనుగోలు చేయగలవని, పేదలకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అలాగే వరంగల్ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన డిసెంబర్‌లో జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ ఎందుకు ఇవ్వడం లేదని మోదీని ప్రశ్నిస్తానని, ఇస్తే.. ప్రజలకి మంచిది, ఇవ్వకపోతే తెలంగాణ ప్రజల రియాక్షన్ బీజేపీ చూస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడుతూ.. రాజకీయాల్లో కాళ్లకు కట్టెలు పెట్టడం సహజం. కానీ అక్కడే ఆగిపోవద్దు, ముందుకు సాగాలి” అని కార్యకర్తలకు హితబోధ చేశారు.
తాను సీఎం అయ్యేముందు కొంతమందిపై కోపం ఉన్నా, ఇప్పుడు పని పై దృష్టి పెట్టి సైలెంట్‌గా ముందుకు సాగుతున్నానని చెప్పారు. కాంగ్రెస్‌లో విభిన్న మనస్తత్వాలు ఉన్నప్పటికీ, మంచి అభిప్రాయం, మంచి ఉద్దేశాలు మాత్రం ఏకంగా ఉండాలని సూచించారు. ఇక చివరలో.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనదే. నేను సీఎం కావచ్చు, కానీ DCC పదవులు పొందడం నిజమైన కష్టమే. ఆ విలువ మీకు తెలుసు. అందరం కలిసే పని చేసినప్పుడే కాంగ్రెస్ బలపడుతుందని అన్నారు.
