Site icon NTV Telugu

Revanth Reddy Security Removed: రేవంత్ రెడ్డి సెక్యూరిటీని తొలగించిన ప్రభుత్వం

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. సెక్యూరిటీ లేకుండానే ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. నిన్నటి ( బుధవారం ) నుంచి రేవంత్‌ చూట్టు గన్‌మెన్లు కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే, గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్‌ పోలీసుల్నీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రెడ్‌ డైరీలో మీ పేర్లు రాసి పెడతా.. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం.. అసలు మిత్తితోని చెల్లిస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.

Read Also: INS Vindhyagiri: ‘ఐఎన్ఎస్ వింధ్యగిరి’ ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

అయితే, ఈ వ్యాఖ్యలకు నిరసనగానే గన్‌మెన్లు రేవంత్ రెడ్డికి కల్పించాల్సిన భద్రతా విధులకు డుమ్మా కొట్టినట్లుగా ముందు సమాచారం అందింది.. కానీ రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో భద్రతను సర్కార్ తొలగించింది. గతంలో 4+4 ఉండే సెక్యూరిటీని తర్వాత 2+2కి కుదించిందని.. ఇప్పుడు పూర్తిగా భద్రతాను తొలగించింది. టీపీసీసీ చీఫ్ పాదయాత్ర చేసిన సమయంలో కూడా తన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం లేదని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓ పార్టీకి చెందిన నాయకుల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి అప్పట్లో ఆదేశించింది.. కానీ తాజాగా ఆయన భద్రతా సిబ్బందిని తొలగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: BRS First List: గెలుపు గుర్రాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ ఇదే..?!

Exit mobile version