Site icon NTV Telugu

Revanth Reddy: గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం!

Revanth Reddy

Revanth Reddy

గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలన్నారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

‘రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గాంధీ అనే పదం ఈ దేశానికి పర్యాయ పదం. అన్ని మతాల సహజీవనం ఎలా స్పూర్తి ఇస్తుందో.. గాంధీ అనే పదం కూడా అదే స్పూర్తినిస్తుంది. గాంధీని బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజుల్లోనే మతతత్వ వాదులు గాంధీని హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే మతతత్వ వాదులు ప్రమాదకరం అని గుర్తు పెట్టుకోవాలి. దేశం కోసం మొదటి తరం గాంధీ.. రెండో తరం ఇందిరా గాంధీ.. మూడో తరం రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

‘రాజీవ్ గాంధీ స్పూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మతసామరస్యం కాపాడుతాం అని చార్మినార్ ముందు రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. చెప్పినట్టుగానే కుల గణన చేశాం. 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ పోయింది. ఆ 8 సీట్లలో బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. పార్లమెంట్కి వచ్చే సరికి ఇటు పోయాయి. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కూడా కుట్ర జరుగుతుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సీఎం ప్రధానం చేశారు.

Exit mobile version