Site icon NTV Telugu

Revanth Reddy: మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం.. జర ఆలోచించండి!

Revanth Reddy

Revanth Reddy

దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో జర ఆలోచించాలన్నారు. మిమ్మల్ని (రాష్ట్ర సంస్థలు) ఎందుకు వదులుకుంటాం అని, అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనది అని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఈ షో కొనసాగనుంది.

క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఇన్వెస్ట్మెంట్ కోసం విదేశాలకు పోయాం. అలాంటి మేము రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించం, మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం. అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుంది. ప్రతీ వ్యక్తిని సంతోష పెట్టకపోవచ్చు. నేను మధ్యతరగతి ఆలోచన ఉన్న వాణ్ణి, ఉన్నంతలో సర్దుకుపోయే తత్వం నాది. కొల్లగొట్టి విదేశాలకి పోవాలని నాకు లేదు. నేను ఓపెన్ మైండ్తో ఉన్నా. నాకు 10 ఆప్షన్స్.. మీకు ఒకటే ఆప్షన్. వైఎస్ ఔటర్ వేసినప్పుడు కూడా ఆరోపణలు చేశారు, అపోహలు సృష్టించారు. ఎవరు ఏం ఆలోచన చేసినా దాని వెనక ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతారు. ఫోర్త్ సిటీ అంటే.. కొందరు ఫోర్ బ్రదర్స్ అంటున్నారు. మీరే కదా నా ఫోర్ బ్రదర్స్. మెట్రో విస్తరణ చేయకపోవడం వల్ల పదేళ్లు వెనక పడ్డం. డిల్లీ పోతున్నారు అని లెక్కలు వేస్తున్నారు. అనుమతులు ఇచ్చే వారు డిల్లీలోనే కదా ఉన్నది. సీఎంకి డిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చారు. ఫార్మ్ హౌస్ లాగ వాడటానికి ఇవ్వలేదు’ అని అన్నారు.

Also Read: Hyderabad Fertility Scam: సృష్టి తరహాలో వెలుగులోకి మరో అక్రమ దందా.. ఇంట్లోనే సరోగసి, ఐవీఎఫ్‌ ట్రీట్మెంట్!

‘కాళేశ్వరం కోసం 11.50కి వడ్డీకి అప్పులు తెచ్చారు. మనం తెస్తమా..?. కాళేశ్వరంపై తెచ్చిన అప్పులో 29 వేల కోట్ల అప్పు కట్టిన ఇప్పటి వరకు. డెట్ రిస్ట్రాక్షన్ ఇవ్వండి అని అడిగా. ప్రధాని మోదీతో మాట్లాడి 7.5 ఇంట్రెస్ట్ కి తగ్గించా. అది నా కమిట్మెంట్. రెండు లక్షల కోట్లను 7.5 ఇంట్రెస్ట్ కి ఇవ్వండి అని కొట్లాడుతున్నా. అప్పులు ఉంటే వ్యాపారంలో రాణిస్తారా?, అట్లనే ప్రభుత్వం కూడా. మనకు పోర్ట్ కనెక్టివిటీ లేదు. జపాన్లో ఏ కంపెనీతో మాట్లాడినా పోర్ట్ కనెక్టివిటీ అడుగుతున్నారు. 45 km మేర రింగ్ రోడ్డు ఉంది, 11 రేడియల్ రోడ్డులు ప్లాన్ చేస్తున్నాం. హైడ్రా ఎందుకు తెచ్చాం. చెరువులు మనమే మూసేస్తిమి. నీళ్ళు ఇంట్లకు రాకుంటే ఎటు పోతాయి. యుద్ధం వచ్చినప్పుడు సైనికులే కాదు.. అక్కడక్కడ సామాన్యులు కూడా చనిపోతారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version