Site icon NTV Telugu

Revanth Reddy : కోదండరాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు

Revanth Reddy On Brs

Revanth Reddy On Brs

టీజేఎస్ చీఫ్ కోదండరాంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌ రావు థాక్రే, బోస్‌ రాజు భేటీ అయ్యారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కోదండరాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, ప్రజల పక్షాన నికార్సుగా నిలబడ్డారన్నారు. కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి కలిగించాలని కలసి పని చేద్దాం అని కోరామన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రజలకి కోదండరాం మీద విశ్వాసం ఉందని, అధిష్ఠానం సూచన మేరకు కోదండరాం ని కలిశామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. సహకారం తీసుకోవాలని పార్టీ భావిస్తోందని, ఇద్దరి అవగాహన పత్రం విడుదల చేస్తామన్నారు రేవంత్‌ రెడ్డి. సమన్వయం కోసం కమిటీ వేస్తామని, ప్రజల సమస్యలకు పరిష్కారం ఎలా ఉండాలి అనేది చర్చ చేశామన్నారు.

Also Read : Ram Gopal Varma: చూడు బేబీ.. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.. రాంగోపాల్ వర్మ

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం లో tjs కీలక పాత్ర పోషిస్తోంది. కేసీఆర్ కుట్రలు..కుతంత్రాలు తిప్పి కొట్టండి. లక్ష్యం గొప్పది… దానికోసం కలిసి పని చేస్తాం. కోదండరాం నుండి కొన్ని ప్రస్తావన చేశారు. అధిష్టానంతో మాట్లాడి చెప్తాం. నియంతను గద్దె దించాలి అనేది ప్రధాన అజెండా. జర్నలిస్టుల లను కూడా మోసం చేశారు. దుగ్యాల ప్రవీణ్ రావు కు టెలిఫోన్ ట్యాపింగ్ బాధ్యత అప్పగించారు. అందరి ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు. ప్రైవేట్ సైన్యం ని తయారు చేసుకున్నారు. హ్యాకర్స్ ని కూడా ఎంగేజ్ చేశారు కేటీఆర్. మా ఫోన్ లు హ్యాకింగ్ చేస్తున్నారు. మమ్మల్ని నియంత్రించాలని చూస్తున్నారు. మాకు సహకరించాలి అనుకున్నా వారిని బెదిరిస్తున్నారు. మా బంధువులు.. మిత్రులను కూడా బెదిరిస్తున్నారు కేటీఆర్. ఈ పద్దతి మంచిది కాదు. కేటీఆర్.. బెదిరిస్తున్నాడు వ్యాపారులను. ఫోన్ లో మాట్లాడిన మాటలు కూడా కేటీఆర్ వాళ్లకు చెప్తున్నారు. హరీష్..కేటీఆర్..కేసీఆర్.. అనైతికంగా వ్యవహారం చేస్తున్నారు. కేసీఆర్ సైన్యంలో పని చేస్తున్న అధికారులపై విచారణ చేస్తాం. అధికారం లోకి రాగానే అన్నిటిపై విచారణ ఉంటుంది’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Israel Hamas War: హంతకులని బతకనీయం… రష్యా విమానాశ్రయంలో మూకుమ్మడి హత్యాయత్నం

Exit mobile version