Site icon NTV Telugu

Revanth Reddy Open Letter: రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy Open Letter: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది.. ఇక, తనకు మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా ఒకస్థానంలో గెలుపొందడంతో.. మొత్తంగా 65 ఎమ్మెల్యే బలం ఆ పార్టీ ఉంది.. రేపు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.. మంగళవారం రాత్రి సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అంటూ అధిష్టానం ప్రకటించింది.. ఇక, ఆ తర్వాత హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఆయన.. పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపారు.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేశారు.. ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ అందరిని కలిసి ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.

Read Also: Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్‌రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు, బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్‌ 7వ తేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.. మీ అందరికీ ఇదే ఆహ్వానం అంటూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు రేవంత్‌రెడ్డి.

Exit mobile version