Site icon NTV Telugu

Sudharshan Reddy: సుదర్శన్‌రెడ్డికి కీలక పదవి.. ఆరు గ్యారంటీల బాధ్యత ఆయనదే..

Sudharshan Reddy

Sudharshan Reddy

Sudharshan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలు అప్పగించింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు కీలకమైన బాధ్యత లభించడం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సమతుల్యత సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన మరో సీనియర్ నేత, మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి, బుజ్జగింపు చర్యలు సఫలీ కృతమైనట్లు కాంగ్రెస్ భావిస్తోంది.

READ MORE: JD Vance-Erika kirk: ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్న జేడీ వాన్స్.. ఇంటర్నెట్ షేక్

మరోవైపు..మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్‌ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.

READ MORE: Upcoming 5G Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. నవంబర్‌లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే!

Exit mobile version