Site icon NTV Telugu

Revanth Reddy : కేసీఆర్‌కి విశ్వాస పాత్రుడుగా సీఎస్‌ మారిపోయారు

Revanth Reddy

Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడుల విషయాన్ని డీజీపీ ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ చేయాలని మొయినాబాద్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అంతేకాకుండా.. సిట్ సేకరించిన ఆధారాలు.. ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వండి అని కోర్టు అడిగిందని, అందుకే మేము 12 మంది ఎమ్మెల్యేల వివరాలు ఇచ్చామన్నారు రేవంత్‌ రెడ్డి. ఈ వివరాలను విచారణలో చేర్చండి అని డీజీపీని కోరామని, సీఎస్‌ అపాయింట్ మెంట్ ఆడిగితే జ్వరం వచ్చింది అంటున్నారని, తప్పించుకు తిరుగుతున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Reliance Jio True 5G: ఏపీలో మరో 2 నగరాల్లో.. దేశవ్యాప్తంగా 10 చోట్ల జియో ట్రూ 5జీ సేవలు షురూ..

బాధ్యతారాహిత్యంగా సీఎస్‌ ప్రవర్తిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. కలవడానికి కూడా తప్పించుకు తిరుగుతున్నావు అంటే.. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్‌ వత్తాసు పలుకుతున్నారు అని రుజువైందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. డీజీపీ …మేము ఇచ్చిన ఫిర్యాదు సీబీఐకి ఇవ్వాలని, లేదంటే… కోర్టు మెట్లు ఎక్కుతామన్నారు. సీఎస్‌ మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గురు దక్షిణ ఇస్తున్నాడని, ప్రజలకు కాకుండా.. కేసీఆర్ కి లాయల్ గా ఉంటున్నారని, మనం సీఎస్‌ ఛాంబర్‌లో కలవకపోతే.. కోర్టులో సీఎస్‌ను కలుద్దామన్నారు. కోర్టుకు పిలిపిస్తాం సీఎస్‌ని..కేసు వేస్తామని, సీఎస్‌ మీద స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తామని, కేసీఆర్ కి విశ్వాస పాత్రుడుగా సీఎస్‌ మారిపోయారని ఆయన మండిపడ్డారు.

Exit mobile version