మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసులో పలు అంశాలతో కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. లీగల్ నోటీస్‌ను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమం తో కేటీఆర్ కు సంబంధం లేదన్నారు. ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Shriya Saran: క్లివేజ్ షోతో కాక రేపినా.. థైస్ షోతో దుంప తెచ్చినా నీ తరువాతనే అమ్మడు
టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని, టీఎస్పీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందని, అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారా నే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టులో పిటిషన్ వేశామని, ఈడీ, ఏసీబీకి ఫిర్యాదు చేశామన్నారు.
Also Read : Kishan Reddy : ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం అయింది.. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది
