NTV Telugu Site icon

Revanth Reddy : 42 మంది ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను కొన్నది కేసీఆర్

Revanth

Revanth

ఎమ్మెల్యేలను రేవంత్ కొనాలి అని చూశాడు అని కేసీఆర్ అంటున్నాడని, కొనుగోళ్ల మీద చర్చ కు సిద్ధమా అని సవాల్‌ విసిరారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. 42 మంది ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను కొన్నది కేసీఆర్ అని ఆయన విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి.. తలసాని ఏ పార్టీలో గెలిచారు.. ఎక్కడ మంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళందరిని ఎన్ని పెట్టి కొన్నావు కేసీఆర్.. నేను సీబీఐ.. ఈడీకి లేఖ రాస్తా.. నా కేసు.. నువ్వు కొన్న కేసుల మీద విచారణకు సిద్ధమా..? కేసీఆర్ మొగోడే అయితే.. ఎమ్మెల్యే.. ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ కొనుగోళ్ల పై విచారణకి లేఖ రాయి. లేకపోతే కామారెడ్డి లో ముక్కు నేలకు రాయి అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా.. ‘కామారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి. బూచోడు వస్తున్నాడు.. భూములు లాక్కుంటాడు. జాగ్రత్త గా ఉండండి. భూములు లాక్కుంటాడు. తర్వాత కనపడడు.. వినపడదు. మీ అందరికి నేను అండగా ఉంటా. కామారెడ్డి గడ్డమీద నుంచి తెలంగాణ భవిష్యత్ ను మీరు నిర్ణయించబోతున్నారు. యావత్ రాష్ట్రమంతా కామారెడ్డి తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు కామారెడ్డి సిద్ధమైంది. గతంలో సమస్యలు తీర్చేవారు లేక లింబయ్య అనే రైతు సెక్రటేరియట్ ఎదురుగా ఉరేసుకునే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. లింబయ్య కుటుంబతగాదాలతో చనిపోయాడని తప్పుడు ప్రచారం చేసి ఆ కుటుంబాన్ని క్షోభకు గురి చేశారు. పంట కొనేవారు నాధుడు లేక మరో రైతు కల్లంలోనే గుండె ఆగి చనిపోయాడు. నువ్వు నిజంగా కామారెడ్డి బిడ్డవే అయితే ఆ రైతులను ఎందుకు ఆదుకోలేదు.. గజ్వేల్, ఎర్రవల్లి రైతులకు నువ్ చేసింది ఏంటి? గజ్వేల్ ను బంగారు తునక చేసి ఉంటే.. నువ్ కామారెడ్డికి ఎందుకు పారిపోయి వచ్చినవ్. గజ్వేల్ రైతుల ప్రాణాలతో చేలాగాటమాడిన నువ్వు.. కామారెడ్డి రైతులను ఆదుకుంటావా? మాస్టర్ ప్లాన్ పేరుతో కేసీఆర్ ఒక కుట్ర తో కామారెడ్డికి వచిండు.. రైతులు తిరగబడటంతో కొడుకును పంపి మాస్టర్ ప్లాన్ రద్దు చేసిండు.

రద్దయింది మాస్టర్ ప్లాన్ కాదు.. మీ ప్రభుత్వమే రద్దయింది.. ఒక బీసీ బిడ్డ గంపగోవర్ధన్ సీటు కేసీఆర్ గుంజుకున్నాడు.. దోచుకున్నది చాలక మళ్లీ మూడోసారి సీఎం ను చేయాలని అడుగుతుండు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను బండకేసి కొట్టుడు ఖాయం. ఎమ్మెల్యేను కొనడానికి పోయిన రేవంత్ ను మీరు ఎమ్మెల్యే చేయొద్దు అని కేసీఆర్ అంటుండు.. 40 ఎమ్మెల్యేలను 12 మంది ఎమ్మెల్, ఇద్దరు ఎంపీలను, సర్పంచ్ లను కొన్నది కేసీఆర్…. గంపగోవర్ధన్ ఏ పార్టీ వాడు… ఆయన్ను టీడీపీ నుంచి నువ్వు కొనలేదా? రాష్ట్రాన్ని అమ్మకాలు, కొనుగోలు కేంద్రంగా మార్చిందే కేసీఆర్.. కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఎమ్మెల్యేలు , ఎంపీలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? బూచోడు వచ్చి మీ భూములు గుంజుకుంటాడు.. మీకు కనబడడు, మీకు వినబడడు.. కామారెడ్డి ప్రజలకు న్యాయం జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి… ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి..’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.