NTV Telugu Site icon

Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది

T Congrss Pac

T Congrss Pac

కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వచ్చే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ మహిళా గర్జనలు నిర్వహించాలని చర్చించారు. ఈ నెలాఖరులోపు బీసీ గర్జన.. డిక్లరేషన్.. నెలకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చర్చించారు కాంగ్రెస్‌ నేతలు. సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలని, 15 రోజులకో డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు నేతలు. మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఏడాది తరవాత పీఏసీ మీటింగ్ కి జగ్గారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కూడా సైలెంట్ గా జగ్గారెడ్డి ఉండటం గమనార్హం. భువనగిరిలో రైతులకు బేడీలు వేస్తే పట్టుంచుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీహెచ్‌ సమావేశంలో లేవనెత్తారు.

GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!

భువనగిరి రైతుల కోసం ఆందోళనలు చేయాలని సూచించారు. పార్టీలో ఎవరిని చేర్చుకున్నా.. పాత వాళ్ళను పక్కన పెట్టేలా చేయకండని, అందరిని కలుపుకుని పోయేలా ఉండాలని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజుల్లో మండల కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారిందని, ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిందన్నారు. అధికారులు ఎవరు అందుబాటులో లేరని, చనిపోయారు అనే సమాచారం చెప్పాలని అనుకున్నా.. అందుబాటులో లేరన్నారు. గ్రామ సచివాలయం మొదలుకుని.. సచివాలయం వరకు అధికారులు అంతా బీఆర్‌ఎస్‌ సేవలో ఉందన్నారు.

Hyundai Exter Launch 2023: ఆహా అనేలా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంటీరియర్.. అత్యాధునిక ఫీచర్లు! లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఇది సరికాదని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది దగా పేరుతో.. 22న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్ని సమీకరించి నిరసన ర్యాలీ.. రావణాసురుడి దిష్టి బొమ్మ దహనం, కేసీఆర్ ఫోటోకి పది తలలు పెట్టి చేస్తామని ఆయన వెల్లడించారు. భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగింపు ఉంటుందని, అక్కడికి జాతీయ నాయకులను పిలుస్తున్నామన్నారు. భారీ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు.

Show comments