NTV Telugu Site icon

CM Revanth Reddy : కేసులకు రేవంత్ రెడ్డి భయపడుతాడా

Revanth Reddy

Revanth Reddy

భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేసి మన చిత్త శుద్దిని చాటుకున్నామన్నారు. సెమీ ఫైనల్ లో ఆరోజు కేసీఆర్‌ను ఓడించి బుద్ధి చెప్పామని, ఈ ఫైనల్ లో గుజరాత్ నుండి వచ్చిన మోడీ నీ ఒడగొట్టాలన్నారు. ఈ గడ్డ పైనా గుజరాత్ పెత్తనం ఏంటి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కు చేయాల్సిన అన్యాయం చేశారని, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడా అని ఆయన అన్నారు. బీజేపీకి నాలుగు వందల సీట్లు కావాలి.. ఇవి ఎందు కంటే రిజర్వేషన్లు ను ఎత్తే సేందుకే ఈ సీట్లు అడుగుతున్నారు బీజేపీ నేతలు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏస్ సి ..ఏస్టి కి రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధి కి సహకరించింది.. ఓబీసి కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బీసీ రిజర్వేషన్ లు పెంచాలని మేము అంటుంటే అగ్ర వర్ణాల కోసం ఈ రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. బడుగు బలహీనర్గాలకు రిజర్వేషన్లు కోసం నేను అడుగుతుంటే. డిల్లి నుండి బిజెపి వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారని, కేసులకు రేవంత్ రెడ్డి భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘కేసీఆర్‌ తప్పుడు కేసులతో నన్ను జైల్ లో పెడితే ప్రజలు బుద్ధి చెప్పారు. అదే స్ఫూర్తి తో మోడీకి కూడా బుద్ధి చెప్పాలి. కేసీఆర్‌ ఖమ్మంలో చెప్పిన మాటల అర్థం ఏంటి 12 సీట్లు ఇస్తే మా నమనాగేశ్వర్ మంత్రి అవుతారు అన్నారు అంటే దాని అర్థం ఏంటి. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. బీఆర్‌ఎస్‌ నుండి ఒక అమాయకుడిని వరంగల్ నుండి పోటీ లో పెట్టీ బిజెపి నుండి పోటీ లో ఉన్న అరూరి నీ గెలిపించే కుట్ర కేసీఆర్‌ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న పొత్తు దీనితోనే బయట పడింది. తెలంగాణలో ఇక కార్ లేదు. కార్ షెడ్ కి వెళ్ళలేదు మొత్తం పడిపోయింది. అందుకే కేసీఆర్‌ బస్సుల్లో తిరుతున్నాడు. ‘ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

 

పరకాల-భూపాలపల్లి జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పదేళ్లు అధికారంలో ఉన్నా జయశంకర్ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చలేదు.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కార్యకర్తల బాద్యత తీరలేదు… మీ బాధ్యత ఇంకా మిగిలే ఉంది.. జరగబోయే ఫైనల్స్ లో మోదీని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేయాలి.. వరంగల్ కు ఔటర్ రింగు రోడ్డు రాలేదు.. రావాల్సిన ఎయిర్ పోర్టును మోదీ అడ్డుకున్నారు.. ఇదేమని ప్రశ్నించిన నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు.. కేసీఆర్ నన్ను అక్రమ అరెస్టు చేసినట్లే… మోదీ కూడా అదే పద్ధతి అవలంభిస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది.. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ కోరుతోంది.. బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు.. అందుకే గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులను పంపించారు… నన్ను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించారు.. బీజేపీ నాయకులకు చెబుతున్నా.. గుజరాత్ పెత్తనమా..? తెలంగాణ పౌరుషామా? తేల్చుకుందాం.. రాజాకార్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది.. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు..

 

ఢిల్లీ పోలీసులను కాదు.. సరిహద్దులో సైనికులను తెచ్చుకో.. భయపడేది లేదు.. ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి.. మనం నిలవాలి.. 12 సీట్లు ఇస్తే హంగ్ వస్తుందని.. నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారు.. ఇండియా కూటమిలో కేసీఆర్ ను చేర్చుకునే ప్రసక్తి లేదు… ఇక ఆయన కలిసేది బీజేపీ తోనే అనే విషయం స్పష్టమైంది.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే… బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఎన్నికల తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు.. బీఆరెస్ కు ఒక్క ఓటు వేసినా.. అది మురిగిపోతుంది.. కారు కార్ఖానాకు పోయింది.. ఇక దాన్ని జుమ్మేరాత్ బజార్ లో తూకానికి అమ్మాల్సిందే.. కడియం కావ్యను రెండు లక్షల మెజారిటీతో గెలిపించండి..
వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది..’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.