తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేటి ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే, మధ్యాహ్నం 1 గంటకు వర్ధన్నపేట బహిరంగ సభతో పాటు సాయంత్రం 4 గంటల నుంచి కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Read Also: War 2: టైగర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్… హ్రితిక్ కి అతిపెద్ద సవాల్
అయితే, కొడంగల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక, కొడంగల్ లో నిన్న ( సోమవారం ) రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి చూస్తున్నారని తెలిపారు. 2009 నుంచి 2018 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొడంగల్ లో అన్ని అభివృద్ధి పనులు చేశాను.. కానీ, 2018 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేసీఆర్, రామారావు, హరీశ్ రావు హామీ ఇవ్వడంతో ఇక్కడి ప్రజలు తనను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు.. అయితే, ఇక్కడ మాత్రం అభివృద్ది చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.