Revanth Reddy : కేసీఆర్‌ను ఇంకెవరూ కాపాడలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఇంకెవరూ కాపాడలేరన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. సీఎం మారారా.? కాంగ్రెస్‌లో ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు. బీఆర్ఎస్లో సీఎం అవుతానని చెప్పే ధైర్యం హరీష్‌రావుకు ఉందా.?అలా చెబితే హరీష్ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్‌లో ఉద్యమకారులకు సీట్లిచ్చాం. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. బీఆర్ఎస్లో ఉంటేనే తెలంగాణ ఉద్యమకారుడా..? తెలంగాణ ద్రోహులు అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నేను ఏ రోజు తెలంగాణను వద్దని చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం సీట్లిచ్చాం. పార్టీ ఫిరాయించినవారికి, కాంట్రాక్టర్లకు కేసీఆర్ పదవులిచ్చారు. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. శ్రీకాంతచారి తల్లికి ఓడిపోయే సీటిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారం కుటుంబం కోసమే వాడుతున్నారు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చినా సోనియా కుటుంబం పదవులు తీసుకోలేదు. మొన్నటివరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని అన్నారు. గాంధీభవన్‌లో ఈటలు తోలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే ఈ ఆరోపణలు. ధరణి లోపభూయిష్టమైన వ్యవస్థ. కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారుల కుటుంబం. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోంది. రెవెన్యూ రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతికి రికార్డులిచ్చే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారు. భూ భారతి కింద డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేపట్టిందే గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్. ధరణి వచ్చాక.. హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు వందల ఎకరాలకు ఆసాములయ్యారు. ఎప్పుడో ఊళ్లలో భూములు అమ్ముకున్నవాళ్ల పేర్లు.. ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయి..? ‘ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!