నిన్న ప్రారంభమైన కొత్త సచివాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే.. ఆయన సెక్రెటేరియట్ చేరుకోకముందే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీగా సెక్రటేరియట్ వెళితే పోలీసులకు అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఆపడం అప్రజాస్వామికమని, నేనొక్కడినే వెళ్లి అధికారులను కలుస్తానని చెప్పానన్నారు. పోలీసు వాహనంలోనే తీసుకెళ్లి తీసుకురమ్మన్నానని, అయినా పోలీసులు ఒప్పుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. ఔటర్ రింగురోడ్డులో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఓఆర్ఆర్ ను తెగనమ్ముకున్నారని, నేనొక్కడినే వెళ్లి అరవింద్ కుమార్ ను కలిస్తానంటే పోలీసులకు అభ్యంతరం ఏంటన్నారు. రోడ్లపైనే నన్ను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
Also Read : Mahesh Babu: జక్కన్న గండం దాటించే ధీరుడు ఎవరు?
ఓఆర్‌ఆర్ టోల్… కరోనా సమయంలో కూడా రోజుకు రెండు కోట్లు వచ్చేవని, అలాంటి ఓఆర్‌ఆర్‌ని ముంబాయికి చెందిన కంపెనీకి అప్పగించిందన్నారు. ఐఆర్‌డీ కంపెనీకి 7,380 కోట్లకు ప్రభుత్వం కట్టబెట్టిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓఆర్‌ఆర్ కనెక్టవిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని, టోల్ కనీసం 40 రూపాయలు వసూలు చేస్తుందన్నారు. మూడు నెలల్లో రద్దు అయ్యే ప్రభుత్వం 30 యేండ్లు ముంబై కంపనీ కి కట్టబెట్టారని, కేటీఆర్ ఈ తతంగం లో ఉన్నారన్నారు. సచివాలయంలో కొత్త పెళ్ళికొడుకు చేసినంత హడావుడి చేశారు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. కొత్తగా సీఎం అయినట్టు… సంతకాలు పెట్టారని, అంబేద్కర్ పేరు పెట్టి… ఎంపీ హక్కులు కాల రాస్తున్నారన్నారు.
Also Read : CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష.. అదనంగా 2,100 ఎంబీబీఎస్ సీట్లు
లోకల్ ఎంపీగా సచివాలయం వెళ్తా అంటే ఆపారు.. నక్సలైట్లను కూడా ఇలా అరెస్ట్ చేయరు. సచివాలయంకి కిలో మీటర్ దూరం లోనే అరెస్ట్ చేస్తున్నారు.. నేను దొంగలను పట్టుకోవడానికి వెళ్తుంటే… నన్ను దొంగను అరెస్ట్ చేసినట్టు చేయాలని చూశారు. పోలీసులు… మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం తీసుకువచ్చారు. ఆర్టీఐ కింద పిటిషన్ ఇస్తే రశీదు కూడా ఇవ్వలేదు. రబ్బర్ స్టాంప్ కూడా కొత్త సచివాలయం కి వెళ్ళింది అన్నారు. అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడు.. సచివాలయం లో లేరు..మున్సిపల్ కార్యాలయం లో లేరు.. కేటీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉన్నాడా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రాల్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, ఎవడి అయ్యా సొమ్ము అని… వేల కోట్ల ఓఆర్‌ఆర్ ముంబై కంపెనీకి ఎలా కట్టబెట్టారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ప్రాసెస్ ఏంటో తెలియాలన్న రేవంత్ రెడ్డి.. ఇది ప్రతీ ప్రయాణికుడికి భారం అవుతుందన్నారు. ఓఆర్‌ఆర్‌ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారూ
దీని వెనకాల కేటీఆర్ ఉన్నారని, కేటీఆర్ అవినీతిని కేసీఆర్ కాపాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.