NTV Telugu Site icon

Revanth Reddy : 22 వేల కోట్ల పనుల కోసం బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి పోయాడు

Revanth Reddy

Revanth Reddy

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మద్దతుగా చౌటుప్పల్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దేవులమ్మనాగారం, పీపుల్ పహాడ్, ఎనగండ్లతండా, అల్లపురం, జైకేసారం, నేలపట్ల, కుంట్లాగూడెం, లింగోటం, చౌటుప్పల్ టౌన్,తంగడ్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగురు ఎమ్మెల్యేలున్న పార్టీతో అభివృద్ధి గానిది ఇద్దరి ఎమ్మెల్యేలతో అభివృద్ధి అవుతుందా ? అని ఆయన ప్రశ్నించారు.

 

22 వేల కోట్ల పనుల కోసం బీఏపీలో రాజగోపాల్ రెడ్డి పోయాడని, టీఆర్ఎస్, బీజేపీలను నిలదీయండని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని టీఆర్ఎస్ కి ఓటు వేయడం వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. దుబ్బాక , హుజూరాబాడ్ లో లో బీజేపీని గెలిపించిన ఏం మారిందని, హుజూర్‌నగర్ నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా ఒరిగింది ఏంటి..? అని ఆయన అన్నారు. మహిళకు టికెట్ ఇచ్చాము ఒకసారి అవకాశం ఇవ్వండని, మహిళలు ఓడిపోతే ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వదని ఆయన వ్యాఖ్యానించారు.