CM Revanth Reddy: 2010లో ఒడిశాలో ధరణి ప్రారంభమైంది.. కానీ, కేసీఆర్ నేనే ధరణి తెచ్చానని చెప్పుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాజాగా అసెంబ్లీలో సీఎం ప్రసంగిచారు. ఒడిశాలో ధరణిని కాగ్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందన్నారు. అయినా కేసీఆర్ ధరణిని తెచ్చి పెట్టారని.. ధరణితో దందాలకు తెరలేపారని ఆరోపించారు. ధరణి చిట్టా చెప్పాలనే కేసీఆర్‌ను పదే పదే సభకు రావాలని అడిగానన్నారు. కానీ.. బబుల్ షూటర్ కేసీఆర్‌ను సభకు రావొద్దని చెప్పారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ పేరు పెట్టారని.. అది బయటపడుతుందనే సభ నుంచి పారిపోయారని సీఎం వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ వచ్చాక మండలస్థాయిలో ఉన్న రికార్డులు కలెక్టరేట్‌కు వెళ్లాయి.. డిజిటలైజ్ పేరుతో రికార్డులన్నింటినీ కలెక్టరేట్లకు తరలించారు.. అక్కడే కుట్ర చేశారు.. ఇప్పుడు ఆ రికార్డులు ఉన్నాయో లేవో తెలియదు.. భూదాన్ భూములు కూడా కబ్జా జరిగాయి, వాటిని కూడా బయటపెడతా.. ఆనాడు కాంగ్రెస్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చింది.. భూముల కోసం పోరాటం చేసింది ఎర్రజెండా అయితే.. పంచింది కాంగ్రెస్.. అసైన్డ్ భూములను రక్షించేందుకు బదిలీలను సైతం నిషేధించింది.. పేదలు భూ హక్కులు అనుభవిస్తున్నారంటే.. దానికి కారణం ఇందిరాగాంధీ. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది అంటున్నారు. 98 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. అటవీ, అసైన్డ్, దేవాదాయ భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. ఇందులో నుంచి ఒక్క ఇంచ్ భూమి కూడా తీయొద్దు. ఇంచు భూమి తీసే అధికారం ప్రభుత్వానికి ఉందా.. తీస్తే ప్రభుత్వం ఉంటుందా.? ప్రైవేట్ వ్యక్తుల 3 లక్షల 77 వేల ఎకరాల భూముల మీదనే పంచాయితీ. మాక్ అసెంబ్లీలో కూడా స్పీకర్ దళితుడు అని కేసీఆర్ పోలేదు. అగ్గిపెట్టెరావు కోటి ఎకరాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించండిఅని కేసీఆర్‌తో లేఖ రాయించండి. మేం భూములు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు కొల్లగొట్టడానికి ఏం చేశారో కూడా చెబుతా అని గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2025లోని రికార్డులు సెట్ చేసి.. సమస్య పరిష్కారం కోసం భూభారతి తెచ్చామని వెల్లడించారు. 22A తాము తెచ్చింది కాదని.. ఉమ్మడి ఏపీలో తెచ్చిన చట్టన్నారు. 1999లోనే 22A తెచ్చారు. 22A చట్టం తీసుకొచ్చారు కానీ.. ఏ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలో స్పష్టత లేదన్నారు.

