NTV Telugu Site icon

Revanth Reddy: సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకుని బతికేవాళ్ళు

Revanthreddy

Revanthreddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకున్నది కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Viral Video : ఏందీ సామి ఈ అమ్మాయి.. నరాలు కట్టయ్యేలా ఉన్నాయిగా.. వీడియో షాక్ అవుతారు..

ఏం ఇచ్చినా.. ఏం చేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేను అని టీపీసీసీ చీఫ్ రెవంగ్ రెడ్డి అన్నారు. రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు.. 60 ఏండ్లు దేశాన్ని ఏలిన గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు.. కానీ పదేళ్లు ప్రభుత్వంలో ఉండి వందల ఏకరాలు కొన్నది మీరు.. వంద ఎకరాలు.. ఫామ్ హౌస్ కట్టుకున్నది నువ్వు.. కేటీఆర్ అంత బలుపు పనికి రాదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా.. రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: Bastar: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు ‘బస్తర్’.. నక్సలైటుగా మారిన అదా శర్మ?

ఇంత బలుపు ఉన్న నాయకులు అవసరమా? మనకు అని రేవంత్ రెడ్డి అడిగారు. రాష్ట్రంలో సన్యాసి ప్రభుత్వం ఉంది.. రైతులను కేసీఆర్ నట్టేట ముంచారని అన్నారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది. రాహుల్ గాంధీ ఎవరు అని అడుగుతున్నారు సన్యాసులు.. రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది.. 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి.. రాష్ట్రాన్ని కొల్లగొట్టారు.. మీకు రాహుల్ ఎవరు అనే అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Show comments