Site icon NTV Telugu

Revanth Reddy : ఆస్కార్ విన్నర్ ను సర్కార్ పట్టించుకోలేదు.. మేము రూ. 10 లక్షలు ఇస్తాం..

Revanth Reddy

Revanth Reddy

ఆస్కార్ అవార్డ్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి చీఫ్ గెస్ట్ గా రాహుల్ వచ్చాడని.. జూన్ 2న జరిగే క్విజ్ ప్రోగ్రాంకి బహుమతులివ్వడానికి ప్రియాంక గాంధీ వస్తారని ఆయన అన్నారు.

Also Read : Bou Samnang: శభాష్ సామ్నాంగ్.. ఆటలో ఓడినా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది

యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం.. అలాగే జూన్ 2వ తారీఖున రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అతనికి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇవాళ రాహుల్ సిప్లిగంజ్ వచ్చినప్పుడు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. పేద కుటుంబం నుంచి ఆస్కార్ స్థాయికి వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ ను రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తుందని అనుకున్నాను.. కానీ కేసీఆర్ సర్కార్ నిరాశపరిచింది అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : TG Venkatesh: పొత్తులపై టీజీ వెంకటేష్‌ హాట్‌ కామెంట్లు..

రాహుల్ సిప్లిగంజ్ కు కాంగ్రెస్ పార్టీ తరపున 10 లక్షల నగదు బహుమానం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అపుడు కోటి రూపాయల నగదు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Exit mobile version