హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సుమారు 3 గంటల పాటు జరిగింది. అయితే.. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన నేతలతో సమావేశం జరిగిందన్నారు. మీటింగ్‌లో కొన్ని తీర్మానాలు చేశామని, సెప్టెంబర్ 7 నుండి 3760 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. దేశాన్ని కులంపేరు మతం పేరుతో విభజన చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రను ఛేదించడానికి రాహుల్ యాత్ర చేస్తున్నారని, పేద ప్రజలకు అండగా ఉండాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆమోదించిందని, ఈనెల 19 నుండి 24 వరకు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 24 నుండి 29 వరకు మండల కేంద్రాల్లో మీటింగ్‌లు ఉంటాయని, వైస్ ప్రెసిడెంట్లను పర్యవేక్షకులుగా నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని, ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే వచ్చాక రాష్ట్రాల్లో కొత్తకమిటీలు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటి వరకు వున్న కమిటీలు రద్దయ్యాయి కొత్త కమిటీలు వచ్చాయని, మండల, గ్రామ, బూత్, జిల్లా కమిటీలు జనవరి 26 వరకు ఏర్పాటు చేయాలన్నారు. ధరణి సమస్యలు, అసైన్డ్ ల్యాండ్స్ ఇష్యూపై కూడా డిస్కస్ చేస్తామని, నేతలకు శిక్షణ తరగతులు కూడా ఉంటాయన్నారు.
Also Read : New Year Events : న్యూయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా..? ఇది మీకోసమే..
సభ్యత్వ కార్డు అందరికి పంపిణీ చేసేలా చర్యలు చేపడుతామన్నారు. ఇంటింటికి వెళ్లి కార్డుల పంపిణి ఉంటుందని, 10 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ వస్తుంది.. అప్పుడు కార్డు వున్న వాళ్లకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తాం, ఛార్జి షీట్ లను ఇస్తామని, ప్రతి గ్రామంలో గ్రామమంతా తిరిగి గ్రామ కూడళ్లలో జెండా పండుగా చేస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రచారం పెంచాలని నిర్ణయించామని, కొత్త కమిటీల్లో బడుగు బలహీన వర్గాలకు 63 శాతం పదవులు ఇచ్చామన్నారు. ఖర్గేకు అభినందనల తీర్మానమని, నేను కూడా జనవరి 26 నుండి పాదయాత్ర చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, పరిపాల తప్పిదాలు, దళిత బంధువు అన్ని అంశాలపై పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. యాత్ర పేరుతో నా పాదయాత్ర ఉంటదని, యాత్ర .. ఫర్ ఛేంజ్.. ఏఐసీసీ ఆదేశాలమేరకు ఈ కార్యక్రమం తీసుకొని చేశామన్నారు.
