NTV Telugu Site icon

Revanth Reddy : అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy about Rahul Gandhi Jodo Yatra In Telangana

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 4న దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ వస్తారని, రాహుల్ గాంధీని కలవాలి అనుకునే వారిని కలిపిస్తామన్నారు. మేధావులు, సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని కలిపిస్తామని, సూత్ర ప్రాయంగా రూట్ మ్యాప్, రేపు డీజీపీని కలిసి అనుమతి కోరుతామని ఆయన వెల్లడించారు. పాదయాత్రకి సబ్ కమిటీలు వేసుకుంటామని, పాదయాత్ర అద్భుతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పనుల విభజన చేసి ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనండి అని కోరుతున్నామన్నారు.

 

తెలంగాణ సమాజం అంతా పాల్గొనాలని, రాజకీయంగా మాతో ఉన్నా లేకున్నా… దేశం బలంగా ఉండాలనే ఆలోచనతో రండని ఆయన అన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి బోయిన్ పల్లిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ శక్తి డబ్బులు అని, మాకు ఉన్న కమిట్ మెంట్ వేరు.. కేసీఆర్ కమిట్ మెంట్ వేరు అని ఆయన విమర్శించారు. సాగర హారం, సకల జనుల సమ్మె టీఆర్‌ఎస్‌ చేయలేదని, జేఏసీ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. అందులో కాంగ్రెస్ పాల్గొన్నదని, కేటీఆర్‌ 61 జీఓ ప్రకారం నాన్ లోకల్ అన్నారు. ఆయన చదివింది గుంటూరు..తరవాత పాట్నాలో.. నేను ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడన్నారు రేవంత్‌ రెడ్డి.