Site icon NTV Telugu

Revanth Reddy : భవిష్యత్తులో ఈ నాయకులకు పార్టీ సరైన స్థానం కల్పిస్తుంది

Revanth Reddy

Revanth Reddy

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి గెలుపునకు కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి ఆదివారం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు పల్లె రవి, కైలాష్ నేత, కృష్ణా రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు కానీ వేరు వేరు పరిస్థితుల కారణంగా హైకమాండ్ స్రవంతి రెడ్డికి టికెట్ కేటాయించింది. టికెట్ రాని నాయకుల్లో నిరాశ తప్పదని, అయితే హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ నాయకులకు పార్టీ సరైన స్థానం కల్పిస్తుందని, వారి సేవలకు కూడా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

 

ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనవసరంగా మతపరమైన అంశాలను లేవనెత్తుతుందని, ఈ క్రమంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉపఎన్నిక సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపునకు తమవంతు సహకారాన్ని అందజేసేందుకు నేతలంతా అంగీకారం తెలిపారన్నారు. ప్రచారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను క్యాడర్ బయటపెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version