Site icon NTV Telugu

Revanth Reddy : అందరం సర్పంచ్‌గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలి

Revanth Reddy Congress

Revanth Reddy Congress

తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. అయితే.. కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ కార్యకర్తలతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో సోనియాగాంధీ పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించారని, ఆమె అభ్యర్థి విషయంలో అందరిదీ ఒకటే ఆలోచన ఉందన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో నాయకుని ఇంచార్జ్ గా నియమించారని, ఒక్కో మండలనికి ఇద్దరు సహాయ ఇంచార్జ్ ల నియామకం జరిగిందన్నారు. 300 బూత్ లకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 150 మంది నాయకుల నియామకం జరిగిందని, తెలంగాణలో ఉన్న 200 మంది ముఖ్య నాయకులను మునుగోడుకు పంపిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 18 నుండి అందరూ క్షేత్ర స్థాయిలో పని చేద్దామని, అందరం సర్పంచ్ గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలన్నారు. ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలవాలి.. ఈ ఉప ఎన్నిక ద్వార టీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరం.. సభల వల్ల ఉపయోగం లేదు.. డోర్ డోర్ తిరిగి కాంగ్రెస్ అవసరాన్ని అవగాహన కల్పించాలి.. అక్కడ ఉన్న కమ్మునిస్ట్ లకు కల్పించాల్సిన అవసరం ఉంది.

 

దుబ్బాక మోడల్ ను మునుగోడు లో ఉపయోగించాలి.. నల్గొండ అంటేనే కాంగ్రెస్ అనే విధంగా చేయాలి.. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర అక్టోబర్ 24 న రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ కు ఎంట్రీ అవుతుందని, కృష్ణా నది బ్రిడ్జిపై రాహుల్ ఎంట్రీ ఇస్తారన్నారు. 15 రోజుల పాటు తెలంగాణ లో రాహుల్ గాంధీ ఉంటారు.. మక్థల్ ,దేవరకద్ర , మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు,మత్తంగి టోల్ గేట్,పఠాన్ చేరు , సంగారెడ్డి,జోగిపేట, శంకరం పేట మీదుగా నాందేడ్ కి వెళ్తుంది.. 350 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగుతుంది. 15 రోజులు రోజోక పార్లమెంట్ వాళ్ళు రాహుల్ గాంధీ తో పాదయాత్ర లో పాల్గొని నడుస్తారు.. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ లు ఒకటిగా నడుస్తారు.. ఉదయం 7:30 -11:00 వరకు 15 కిలోమీటర్లు నడుస్తున్నారు.. 3:30 – 6:30 వరకు రెండవ విడత ఉంటుందని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

 

Exit mobile version