Site icon NTV Telugu

Revanth Reddy : బీఆర్‌ఎస్‌ అంటే బీహార్ రాష్ట్ర సమితి..

Revanth Reddy

Revanth Reddy

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికతో ఆ పార్టీలో రాజకీయం వేడెక్కింది. అయితే.. ఈ సారి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని ఇప్పటికే రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అయితే.. గాంధీ కుటుంబం మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో నిలబడిన వారిలో ఒకరికి మాత్రమే మద్దుతుగా ఉంది. ప్రస్తుతం పోటీలో మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌లు ఉండగా.. మల్లికార్జున్‌ ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. శశిథరూర్ నాకు నిన్న సాయంత్రం కాల్ చేశారని, ఆయన ఫిక్కీ ప్రోగ్రాంకి వచ్చారని తెలిపారు. ఉదయం కాఫీకి రావాలని పిలిచామని, మా దగ్గర బంధువు చనిపోవడం వల్ల అక్కడికి వెళ్లడం వల్ల కలవలేకపోయామన్నారు.

 

ఢిల్లీలో కలుస్త అని చెప్పానని, ఆయన ప్రైవేటు ప్రోగ్రాంకి వచ్చారని ఆయన వెల్లడించారు. బరిలో ఇద్దరు ఉన్నారు నామినేషన్‌ల ఉప సంహరణ 8 వరకు ఉందని, తరువాత పార్టీ డిసిషన్ తీసుకుంటుందన్నారు. ఇది ఫ్రెండ్లీ కంటెస్టు మాత్రమేనని, మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ బిడ్డ అని, తెలంగాణ బిడ్డకు ఏఐసీసీ అధ్యక్షుడుగా అవకాశం వచ్చినప్పుడు కొంతమంది ఆయన్ను గెలిపించాలని చెప్పుంటారన్నారు. ఆయన అవకాశం ఇవ్వాలని కోరడం పాజిటివ్ కోణంలోనే చూడాలని, నా భావన కూడా అదే అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను పీసిసి గా ఉన్న కాబట్టి న్యూట్రల్ గా ఉండాలని,
రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో నాకు ఈడీ నోటీసులు వచ్చిన భయపడనని ఆయన అన్నారు.

Exit mobile version