Site icon NTV Telugu

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్ అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డ అన్నారు. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు రేవంత్‌ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారన్నారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు రేవంత్‌ రెడ్డి. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారన్నారు. పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారని, వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Viral Video : సుముద్రం అడుగున డైవ్ చేస్తున్న కుక్క.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని, తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందన్నారు రేవంత్‌ రెడ్డి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారని, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని, ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన అన్నారు.

Also Read : Indrakeeladri: ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు

Exit mobile version