ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లచ్య తండా నుండి ప్రారంభమై లింగాల క్రాస్ రోడ్డు వరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో అభియాన్ పాదయాత్ర సాగింది. అనంతరం లింగాల క్రాస్ రోడ్ వద్ద జరిగిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లందు నియోజక వర్గంలో కాంగ్రెస్ తరుపున గెలిచి ఈ కామేపల్లి మండల ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన శాసన సభ్యురాలికి గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సభ్యులు మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్న వారికే టికెట్ ఇచ్చి గెలిపించే సాంప్రదాయం ఉండేదని, కేసీఆర్ అందుకు విరుద్ధంగా రామిరెడ్డి వెంకటరెడ్డి మరణిస్తే ఆయన భార్యకు టికెట్ ఇచ్చి ఏకగ్రీవంగా చేయాల్సి ఉండగా ఆ తర్వాత ఎన్నికలు వెంకట్ రెడ్డి భార్యను ఓడించి ఆ కుటుంబానికి క్షోభకు గురిచేసిన ఘనుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టాలతో గెలిచిన హరిప్రియ నాయక్ దొరగారి గడిలో గడ్డి తినడానికి వెళ్ళిందని ఆయన ధ్వజమెత్తారు. ఈమెతోపాటు మరో 11 మంది వెళ్లారని, కాంట్రాక్ట్ ల కోసం కమీషన్ల కోసం 12 మంది సన్యాసులు, గాడిదలు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని నడి బజారులో ఉరితీయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యే లపై సీబీఐ విచారణ జరగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణకు ఆదేశించనట్లయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని అర్థం చేసుకోవాల్సివస్తుందని ఆయన అన్నారు.
Also Read : Hardik Patel: ఐదేళ్ల నాటి కేసులో హార్దిక్ పటేల్ నిర్దోషి.. తీర్పు ఇచ్చిన కోర్టు
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కరెంటు కష్టాలు చూసి 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చాడని, న్యూయార్క్ లో కరెంటు పోయిన తెలంగాణలో కరెంటు పోదని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ ఎటు పోయింది ఆ కరెంటు హామీ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేయబోయే కరెంటఉద్యమానికి కమ్యూనిస్టులు కలిసి వస్తే మరో బషీర్ బాబు పోరాటం చేద్దామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే నిరుపేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలి ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు సేవ చేసిన రామిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. 2024 లో బయ్యారం ఉక్కు కర్మాగారానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేస్తామని, ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ నుంచి ఇంత ముందు గెలిచిన ఓ సన్యాసిని ఓడించాలన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Nikki Tamboli: దేవుడా.. ఈ చీకటిగదిలో చితక్కొట్టుడు పాప.. మళ్లీ చితక్కొట్టిసిందే
