NTV Telugu Site icon

Revanth Reddy: భట్టి పాదయాత్ర పార్టీ కోసం చేసింది కాదు.. తెలంగాణ సమాజం కోసం

Batti

Batti

Revanth meets Bhatti: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లెంపాడులో భేటీ అయ్యారు. అయితే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి భట్టి పాదయాత్రలో కలవడం ఇదే మొదటిసారి. జులై 2న జరగబోయే తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం గురించి చర్చించారు. మరోవైపు సమావేశం అనంతరం జనగర్జన సభ నిర్వహించే ప్రదేశాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు. అందుకోసం రేవంత్ రెడ్డి, మధుయాష్కీ సభా స్థలికి వెళ్లారు.

Read Also: Mega Princess: పిక్ ఆఫ్ ది డే.. వారసురాలిని చూసి మురిసిపోతున్న మెగా కుటుంబం

ఆదిలాబాద్ జిల్లా నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఈ యాత్ర జూలై రెండో తేదీన ముగియనుంది. దీని సందర్భంగా ఖమ్మంలో జన గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీగా జన సమీకరణ చేయనుంది. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరనున్నారు. అయితే జన గర్జన సభ విజయవంతం చేసేందుకుగాను అవలంభించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి చర్చించారు.

Read Also: Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు

అంతకుముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భ‌ట్టి విక్రమార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర కాంగ్రెస్ పార్టీ కోసం చేసింది కాద‌ని.. తెలంగాణ స‌మాజం కోసం చేసింద‌ని అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ ఈస్ట్ మ‌న్ క‌ల‌ర్ లో చూపిస్తున్న భ్రమ‌ల్ని ఈ పాద‌యాత్ర ప‌టాపంచ‌లు చేసింద‌ని తెలిపారు. భ‌ట్టి విక్రమార్క ఊరూరు తిరుగుతూ అక్కడ జ‌రుగుతున్న త‌ప్పిదాల‌ను, న‌ష్టాల‌ను, కేసీఆర్ చేతిలో మోస‌పోయిన బాధితుల‌ను భ‌ట్టి విక్రమార్క క‌లిసి.. వారికి భ‌రోసా క‌ల్పించార‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Show comments