Site icon NTV Telugu

Honor Smart Phone: మార్కెట్లోకి హానర్-90 రీ ఎంట్రీ.. అదిరిపోయిన ఫీచర్లు..!

Honor

Honor

ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90 స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లోకి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా రియల్‌మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్‌ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్‌ఎస్‌ నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Janhvi Kapoor: బ్లూ లెహంగాలో జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. చూశారా?

ఇండియాలో హానర్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ తేదీ తెలియనప్పటికీ.. కొన్ని నివేదికల ప్రకారం సెప్టెంబర్​మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేల లోపు ఉంటుందని సమాచారం. అంటే సెగ్మెంట్​లో వన్‌ప్లస్‌​11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్​ఫోన్​2 లాంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. హానర్ 90 ఫోన్ కు సంబంధించి కలర్స్.. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌ కలిగి ఉండనుంది. ఇక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్​కు సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. 6.7 ఇంచ్​ అమోలెడ్​ డిస్‌ప్లే, స్నాప్​డ్రాగన్​7 జెన్​1 ఎస్​ఓసీ, 200+12+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌కెమెరా, 50ఎంపీ సెల్పీ కెమెరా, 5000ఎంఏహెచ్​బ్యాటరీ,66వాట్​ఛార్జింగ్​సపోర్ట్​కలిగి ఉంటుందని అంచనా.

Exit mobile version