Site icon NTV Telugu

AP News: ఏపీ ఎస్పీడీసీఎల్‌లో వేలకోట్ల అవినీతి.. రిటైర్డ్ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు!

Retired Ips Ab Venkateswara Rao

Retired Ips Ab Venkateswara Rao

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్‌లో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఇది రెండు పార్టీల అవినీతి ప్రేమ కథ అని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం విచారించేంత పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సంతోష్ రావు లాంటి అధికారుల వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కందుకూరు హత్య కేసులో లక్ష్మి నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయంపై ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజకీయ పార్టీలు లేనిపోని కుల గోడవలతో ప్రజలు సమయాన్ని వృద్దా చేశాయి‌‌‌. ఒక కుల గొడవకు అంత ప్రధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంటి‌‌‌?. నీరు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డీజిల్ ధరలపై జనాలు చర్చించాలి … కానీ కుల‌ గోడవలతో పని ఎంటి?. పనికి మాలిన గోడవలు ప్రజలకు ఎందుకు?. పరిహారం ఇవ్వడానికి ఒక పద్దతి ఉండాలి. మన జేబులో డబ్బులు ఇచ్చినట్లు ఇస్తూ పోతే ఎలా?. మానవీయ కోణం కేవలం కొన్ని కేసులకు పరిహారం ఇస్తే తప్పులేదు. కానీ ఒక‌ కులాన్ని భుజాన్న వేసుకోవడానికి ఈ పరిహారం ఇచ్చినట్టు ఉంది. హత్య కేసుల అన్నిటిలో ఇలాంటి పరిహారం ప్రకటించే పాలసీ నిర్ణయం ఏదైనా తీసుకున్నారా?. దానికి సంబంధించి ఏదైనా జీవో ఉందా.. దీనికి రాజ్యాంగ, చట్టబద్దత, హేతుబద్దత ఉందా?’ అని ప్రశ్నించారు.

Also Read: Rashmika Mandanna: ఆ పని అస్సలు చేయొద్దంటూ.. రష్మికను మందలించిన డాక్టర్‌!

‘ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే సమయంలో జవాబుదారీతనం, చట్టబద్దత ఉండాలి. ఒక పాలసీ నిర్ణయం లేకుండా ఎలా దారాదత్తం చేస్తారు. ఇలాంటి చర్యలతో సమాజంలోకి ఎలాంటి సందేశం పంపిస్తున్నారు. ఇది తప్పుడు సంకేతం పంపిస్తోంది సమాజంలోకి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుష ఘటనలు జరిగినప్పుడు నిందితులను ఆత్మహత్య చేసుకోవడం సాదారణమే. తుని ఘటనలో చనిపోయిన నిందితుడి విషయంలో ఎదైనా అనుమానాలు ఉంటే న్యాయ విచారణ కోరవచ్చు‌‌‌’ అని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.

Exit mobile version