NTV Telugu Site icon

Bengaluru: రెస్టారెంట్‌కు షాక్.. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు భారీ జరిమానా

Tifien

Tifien

ఏదైనా హోటల్‌కు గానీ.. లేదంటే రెస్టారెంట్‌కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు. కానీ ఓ కస్టమర్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వేడి.. వేడిగా తిందామని వెళ్తే.. తీరా చల్లారిన ఆహారాన్ని వడ్డించడంతో మహిళా కస్టమర్ షాక్‌కు గురైంది. ఇదేంటి.. చల్లని ఆహారాన్ని ఇచ్చారని అడిగితే.. సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె మరింత ఆవేదనకు గురైంది. రెస్టారెంట్ తీరుపై జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఆమె విజయం సాధించింది. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు రూ.7,000 జరిమానాను న్యాయస్థానం విధించింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

బెంగళూరులోని ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు ఓ మహిళ కస్టమర్ అల్పాహారం తినేందుకు వెళ్లింది. కానీ తీరా అక్కడికెళ్లాక చల్లని పదార్థాలు వండించారు. దీంతో ఆమె నిలదీస్తే.. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం..చల్లని ఆహారాన్ని అందించనందుకు రెస్టారెంట్‌కు రూ.7,000 జరిమానా విధించింది.

ఇది కూడా చదవండి: Misbehaving: నన్ను తన గదికి పిలిచాడు.. పోలీస్ అధికారి పై ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు