NTV Telugu Site icon

US: హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ అమెరికన్ కాంగ్రెస్ తీర్మానం

Us

Us

దేవాలయాలపై దాడులు.. హిందూమతం పట్ల వ్యతిరేక మతోన్మాదం, హిందూ ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఏప్రిల్ 10న శ్రీ థానేదార్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఏర్పడిన హౌస్‌ కమిటీకి సిఫార్సు చేశారు. హిందూ అమెరికన్లు దేశ అభ్యున్నతిలో పాలు పంచుకుంటున్నప్పటికీ.. వారి నమ్మకాలు, వారసత్వం, చిహ్నాలకు సంబంధించి అసత్య సమాచారం వ్యాప్తి చెందుతోందని, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో వేధింపులు, వివక్షను ఎదుర్కొంటున్నారని తీర్మానంలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?

అలాగే విద్వేషపూరిత ప్రసంగాలు, వివక్షతో కూడిన నేరాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ఏటా పెరుగుతున్నాయని ఎఫ్‌బీఐ హేట్‌ క్రైమ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదికలో పేర్కొన్నట్లు తీర్మానంలో వెల్లడించారు. 1900 సంవత్సరం నుంచి 4 మిలియన్లకు పైగా హిందువులను అమెరికా స్వాగతించిందని, వారి సహకారంతో దేశం ఎంతో ప్రయోజనం పొందిందని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాల క్యాంపస్‌ల్లో బెదిరింపులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Astrology: ఏప్రిల్‌ 13, శనివారం దినఫలాలు