Site icon NTV Telugu

RBI: రెపోరేటును పెంచిన ఆర్బీఐ.. మరింత పెరగనున్న వడ్డీల భారం

Reporate

Reporate

RBI Policy Review: అంచనాలకు అనుగుణంగానే రిజర్వు బ్యాంకు ఇండియా రెపోరేటును పావుశాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

బుధవారం ద్రవ్య విధాన ప్రకటనను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా ద్రవ్యపరపతి విధానంలో సవాళ్లు ఎదురయ్యాయన్నారు. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచింది.

Paper Leak: స్టాఫ్‌నర్సుల రిక్రూట్‌మెంట్ ప్రశ్నాపత్రం లీక్.. పరీక్ష రద్దు

ఒకవైపు ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యానికి తోడు వడ్డీరేట్లు కూడా ఇలా పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు చెబుతున్నప్పటికీ.. వీటిపై సామాన్యుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Exit mobile version