RBI : విదేశాల నుంచి టన్నుల కొద్ది బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంగ్లాండ్ నుండి 100 టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఇంగ్లండ్‌లో కాకుండా భారతదేశంలో ఉంచారు. రాబోయే కొద్ది రోజుల్లో మరింత బంగారం భారతదేశానికి తిరిగి రాబోతోంది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఆర్‌బీఐ వద్ద ఉంచారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో 100.3 టన్నుల బంగారాన్ని భారత్‌లో ఉంచగా, 413.8 టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాల్లోనే ఉంది. ఇది కాకుండా, నోట్ల జారీ కోసం భారతదేశంలో 308 టన్నుల బంగారాన్ని ఉంచారు.
గత కొన్నేళ్లుగా విదేశాల్లో భారతీయుల బంగారం నిల్వలు పెరుగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ దానిని తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి మరిన్ని బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుంది. రిజర్వ్ బ్యాంక్ మళ్లీ 100 టన్నుల బంగారాన్ని దేశానికి తీసుకురాగలదు. సాంప్రదాయకంగా, ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని లండన్‌లో ఉంచుతాయి. మన దేశంలో ఇప్పటి వరకు బంగారాన్ని లండన్ లో ఉంచుకునేది. కానీ ఇప్పుడు దాని బంగారాన్ని పెద్ద మొత్తంలో దేశంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే, నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల కొత్త బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతదేశం నిరంతరం బంగారం కొనుగోలు చేయడం దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. దాని ఆర్థిక భద్రతా నిర్వహణను బలోపేతం చేస్తుందని చూపిస్తుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒకటి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also:Gangs Of Godavari Review: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ
బంగారం తిరిగి ఎలా తెస్తారు?
ఈ భారతీయ బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని కూడా రద్దు చేసింది. అయితే ఈ బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
1991లో బంగారం తాకట్టు
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుండగా, దాదాపు 3 దశాబ్దాల క్రితం నాటి కాంగ్రెస్-థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు భారత్ బంగారాన్ని తాకట్టు పెట్టాయి. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ తన బంగారాన్ని విదేశాలకు పంపి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. జూలై 1991లో కాంగ్రెస్ నరసింహారావు ప్రభుత్వం డాలర్లను సేకరించేందుకు విదేశీ బ్యాంకుల్లో బంగారాన్ని తనఖా పెట్టింది. జూలై 1991లో నరసింహారావు ప్రభుత్వం 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో 400 మిలియన్ డాలర్లను సేకరించేందుకు తాకట్టు పెట్టింది. బంగారాన్ని తనఖా పెట్టడానికి ముందు భారతదేశం కూడా బంగారాన్ని విక్రయించింది.
Read Also:Hyd DEO Orders: పాఠశాలల్లో ఆ రూల్ ఉండకూడదు.. డీఈఓ ఆదేశాలు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!