NTV Telugu Site icon

Bihar: వంతెన స్లాబ్‌, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

Bihar

Bihar

Bihar: బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గురువారం ప్రాణాలు కోల్పోయాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది. బాలుడు తప్పిపోయిన రెండు రోజుల తర్వాత చిక్కుకున్న బాలుడిని రక్షించే ఆపరేషన్ బుధవారం ప్రారంభమైంది. బిక్రంగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉపేంద్ర పాల్ మాట్లాడుతూ.. వంతెన నుంచి బాలుడిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ సుమారు 12 నుంచి 14 గంటల పాటు కొనసాగిందని తెలిపారు.

Read Also: Afghanistan: ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

అంతకుముందు, బాలుడి తండ్రి శత్రుధన్ ప్రసాద్ మాట్లాడుతూ.. తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదని, రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడని చెప్పాడు. బాలుడి కోసం వెతుకుతున్న సమయంలో, సోన్ నదిపై నిర్మించిన వంతెన స్తంభం నంబర్ 1 మరియు స్లాబ్ మధ్య అతను ఇరుక్కుపోయాడని ఒక మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అతడిని రక్షించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఎంతో శ్రమించి ఆ బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది.