Site icon NTV Telugu

Republic : సాయి దుర్గ తేజ్.. దేవా కట్ట.. రిపబ్లిక్ – పార్ట్ 2

Republic

Republic

రేయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేనళ్లుడు సాయి దుర్గ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ సినిమాతో వరుస హిట్స్ కొట్టి సుప్రీమ్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు సాయి. విరూపాక్ష వంటి సినిమాతో కెరీస్ బిగ్గెస్ హిట్ అందుకున్న సాయి ప్రస్తుతం రోహిత్ కేపీ డైరెక్షన్ లో సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.

అయితే సాయి కెరీర్ లో ఒక భిన్నమైన మంచి సినిమా అంటే రిపబ్లిక్ అని చెప్పాలి. విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్ట డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు కానీ విమర్శల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట దేవా కట్టా. ఇటీవల మయసభతో మెప్పించిన దర్శకుడు దేవ కట్ట ఇప్పుడు రిపబ్లిక్ కు పార్ట్ 2 ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట. అందుకు సంబంధించి కథ, కథనాలు రెడీ చేసే పనిలో బిజీగా ఉందట టీమ్. కానీ ఇక్కడ చిత్రంగా అనిపించే విషయం ఏంటంటే రిపబ్లిక్ సినిమాలో బాధ్యతగల జిల్లా కలెక్టర్‌గా కనిపించిన సాయి తేజ్ సినిమా చివరలో చనిపోయినట్లు చూపించారు. మరి ఇప్పుడు సీక్వెల్ లో సాయిని హీరోగా చూపించడం ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్న. మరి దేవా కట్ట ప్లానింగ్ ఎలా ఉందొ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version